రక్తపుమడుగులో మహిళ

Elderly Woman Eliminates In Robbery Bid In Kerala   - Sakshi

దోపిడీదొంగల అరాచకం

తిరువనంతపురం : దోపిడీ దొంగలుగా భావిస్తున్న వ్యక్తులు వృద్ధ దంపతులపై దాడికి తెగబడటంతో 55 ఏళ్ల మహిళ మరణించిన ఘటన కేరళలోని కొట్టాయం వద్ద తజతంగడిలో వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.  స్ధానికుల ఫిర్యాదుతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసలకు రక్తపు మడుగులో ఎలక్ట్రిక్‌ వైర్లతో కట్టిపడేసిన దంపతులు కనిపించారు. మహిళ విగతజీవిగా పడిఉండగా, అక్కడే ఆమె భర్త అచేతన స్ధితిలో కనిపించారు. పదునైన ఆ‍యుధాలతో దుండగులు దాడిచేయడంతో ఇరువురి తలపై తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కారుతో సహా విలువైన వస్తువులు మాయమయ్యాయని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి : ఆమె పరీక్ష కోసం ఏకంగా బోటునే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top