కెనడాలో ఉగ్రవాది హల్‌చల్‌.. ట్రక్కుతో జనాలపైకి

Edmonton police investigating officer attack, truck chase as terrorism

కెనడా : ఓ ఉగ్రవాది పెట్రేగిపోయాడు. కెనడాలోని ఎడ్మోంటన్‌లో వాహనంతో జనాలపైకి దూసుకెళ్లాడు. గతంలో లండన్‌ బ్రిడ్జి, ఫ్రాన్స్‌లోని నీస్‌ దాడి మాదిరిగానే ఓ భారీ వాహనాన్ని తీసుకొని ఓ ఉగ్రవాది పోలీసులపైకి, పాదచారులపైకి నడిపించాడు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వాహనానికి జెండా కట్టుకొని ఉగ్రవాది రెచ్చిపోయాడని, అందరినీ చంపేస్తానంటూ కేకలు పెట్టాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొలుత ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను తీవ్రంగా కత్తితో గాయపరిచిన ఉగ్రవాది నేరుగా ఓ ట్రక్కులోకి వెళ్లి దానిని తీసుకొని రోడ్లెక్కాడు. వెంటనే జనాలపైకి దూసుకెళ్లాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. అరెస్టు చేసిన వ్యక్తిని ప్రశ్నించగా అతడు ఒక్కడే ఈ పనిచేసినట్లు తెలిసిందని, వాహనంలో కొన్ని నల్లజెండాలు దొరికాయని, విచారణలో భాగంగా వాటిని సీజ్‌ చేశామని చెప్పారు. కాగా ఈ ఉగ్రదాడిని ఏ సంస్థ తామే చేసినట్లు ఇంకా ప్రకటించలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top