భార్యను గొడ్డలితో కడతేర్చిన భర్త

Drunken Man Killed Wife With Axe In Kodada - Sakshi

గొడ్డలితో దాడి.. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి

పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

మునగాల మండలం కలకోవలో దారుణం

సాక్షి, కోదాడ: మద్యం మత్తులో ఓ భర్త భార్యపై గొడ్డలితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ ఘటన  మునగాల మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. అనంతగిరి మండలం మొగలాయికోటకు చెంది న గరిడేపల్లి శ్రీనుతో మునగాల మండలం కలకోవకు చెందిన తిరుపతమ్మ, నర్సయ్యల కుమా ర్తె భూలక్ష్మితో 19ఏళ్ల కిందట వివాహా మైంది. పదేళ్లుగా కలకోవలోనే ఇంటిని అద్దెకు తీసుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి డిగ్రీ చదివే కుమారుడు, ఐదో తరగతి చదువుతున్న కూ తురు ఉంది.

తల్లిగారింటికి ఎందుకు వెళ్లావని..
భూ లక్ష్మి సమీపంలోనే నివాసం ఉంటున్న తన తల్లిగారింటికి వెళ్లింది. కాసేపటికి తిరిగి వచ్చింది. అయితే అప్పటికే పూటుగా మద్యం సేవించి ఇంట్లోనే ఉన్న శ్రీను తనకు చెప్పకుండా తల్లిగారింటికి ఎందుకు వెళ్లావని గొడవపడ్డాడు. తదనంతరం గఆగ్రహానికి గురై గొడ్డలి తీసుకు ని భూ లక్ష్మిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన భూలక్ష్మి కుప్పకూలి పడిపోవడంతో ఇం ట్లోనే ఉన్న పిల్లలు పెద్ద పెట్టున కేకలు వేశారు. వెంటనే శ్రీను అక్కడినుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు గమనించి   భూ లక్ష్మిని తొలుత కోదాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుం డగా మార్గమధ్యలో మృతిచెందింది. కాగా, నిందితుడు శ్రీను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగి పోయినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top