తాగిన మైకంలో హత్య

Drunk Man Kills Companion At Asifabad District - Sakshi

ప్రాణం తీసిన విందు భోజనం

సాక్షి, ఆసిఫాబాద్‌: తాగిన మైకంలో హత్య చేసిన సంఘటన బుధవారం తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు మండలంలోని గడలపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మదర్‌ మెడీ గ్రామానికి చెందిన ప్రజలు బుధవారం ఆకాడి పండుగా సందర్భంగా దగ్గరలోని అడవిలోకి వెళ్లి వన భోజనాలు చేశారు.

వన భోజనాల అనంతరం గ్రామస్తులు రాత్రి 7 గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరి గ్రామానికి చేరుకున్నారు. అదే గ్రామానికి చెందిన సోయం జంగు (58) అతిగా మద్యం సేవించడంతో అతన్ని తీసుకెళ్లేందుకు ఆత్రం బాపురావు, కుర్సింగ సురేశ్‌ జంగు పూనుకున్నారు. దీంతో మద్యం మత్తులో ఉన్న సోయం జంగు వారివురిపై కర్రతో దాడి చేయగా సురేశ్, బాపురావు కోపంతో జంగు తలపై, కంటిపై కర్రలు, బండలతో విచక్షణ రహితంగా దాడి చేశారు.

జంగు అక్కడికక్కడే మరణించగా ఎవరికి అనుమానం రాకుండా మృత దేహాన్ని పక్కనే ఉన్న వాగులో పడేశారు. తన తండ్రి ఇంటికి రాలేదని దత్త పుత్రుడు బోజ్జిరావు గురువారం ఉదయం ఆచూకీ కోసం వెతుకుతుండగా వాగులో మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఆకుల ఆశోక్‌ కుమార్, ఎస్సై రామరావు సంఘటన స్థలం చేరుకొని కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా నిందితులు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top