నాలుగు నెలల్లో రూ.32 కోట్లు లూటీ

Cyber Crime Hikes in Karnataka - Sakshi

ఆన్‌లైన్‌లో  చెలరేగిపోతున్న  నేరగాళ్లు

సగటున రోజుకు 25 కేసులు నమోదు

సైబర్‌ నేరాల అదుపునకు నిపుణులు అవసరం

బనశంకరి : రాష్ట్రంలో సైబర్‌ నేరాలు గడగడలాడిస్తున్నాయి. సిలికాన్‌సిటీలో ఉన్న ఏకైక సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో గత నాలుగు నెలల్లో నమోదైన 3,100 సైబర్‌ కేసులకు సంబంధించిసైబర్‌ నేరగాళ్లు రూ.32 కోట్లు దోచేశారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ కా ర్యాలయ ఆవరణలో ఉన్న సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో రోజుకు  ఒక సరాసరి 25 కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారు. సైబర్‌ నేరాలపై ఎంత జాగృతం చేసినప్పటికీ వంచనకు గురయ్యే వారి సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. సైబర్‌ వంచకులు అత్యంత చాణిక్యంతో ప్రజల నగదు పోగొట్టుకుంటున్నారని సైబ ర్‌ క్రైం పోలీసులు తెలిపారు.  బ్యాంక్‌తో పాటు ఆర్థిక వ్యవహారాలను ఇవ్వకూడదు. అదేవిధంగా మీ ప్రైవేటు వ్యక్తిగత ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండా ఉంటే ఎలాంటి సమస్య ఉండవని సైబర్‌ క్రైం పోలీసులు సలహా సూచిస్తున్నారు.  

నగర ప్రజలను టార్గెట్‌ చేస్తున్న చాలామంది వంచకులు ఇతర రాష్ట్రాల్లో మకాం పెడతారు. నగదు తమ అకౌంట్‌కు జమ కాగానే తమ ముఠా ద్వారా ఏటీఎం కేంద్రానికి వెళ్లి తక్షణం నగదు డ్రాచేసుకుని ఉడాయిస్తారు. దేశంలో లోపల ఉన్న సైబర్‌ వంచకులు చిన్నపాటి మొత్తాలకు స్కెచ్‌ వేస్తుంటారు. లక్షాంతర రూపాయలనుంచి కోట్లాది రూపాయలు దోచే స్థితికి చాలామంది నైజీరియాతో పాటు విదేశీ వంచకులే అదికంగా ఉన్నట్లు సైబ ర్‌క్రైం పోలీసులు తెలిపారు. ఎనీ డెస్క్‌ యాప్‌ పట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ హెచ్చరించింది. బెంగళూరు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలో గత నెలలో 20కి పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సహాయం చేస్తామని ఫోన్‌ చేసి కార్డు వివరాలు తెలుసుకుంటున్న వంచకులు అనంతరం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. మనం డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం  రిమోట్‌ యాక్సిస్‌ ద్వారా మొబైల్‌లో ఉన్న ఓటీపీ, మెసెజ్‌తోపాటు ఇతర సమాచారం దొంగలించి కార్యకలాపాలు నిర్వహించి నగదు దోచేస్తారు.  

సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మొత్తం 3,100 కేసుల్లో నగదు కోల్పోయిన బాధితులపైకి 30 నుంచి 40 శాతం వరకు బాధితులకు నగదు తిరిగి చెల్లించడం జరిగిందని సైబర్‌ పోలీసులు తెలిపారు. వంచనకు గురైన బాధితులు ఫిర్యాదు చేసిన అనంతరం వారి నగదు ఏ అకౌంట్‌కు జమ అయింది దానిని ఫ్రీజ్‌ చేస్తామన్నారు. ఒకవేళ నగదు మరో అకౌంట్‌కు జమ అయినట్‌లైతే బ్యాంక్‌ నుంచి సమాచారం తీసుకుని దానిని ఫ్రీజ్‌ చేస్తామని తెలిపారు. చాలా సందర్బాల్లో అకౌంట్‌లో మిగిలిన నగదు బాధితులకు అందించడం జరుగుతుంది.  కస్టమర్లు ఏటీఎం డెబిట్, క్రెడిట్‌కార్డుల సమాచారం తెలపకుండా కార్డు వారి వద్ద ఉంటే స్విమ్మింగ్‌తో పాటు ఇతర మార్గాల్లో వారికి తెలియకుండా బ్యాంక్‌ అకౌంట్, ఈ–వ్యాలెట్‌ నగదు డ్రా, బదిలీ అయినట్లు అయితే ఆ నగదును బ్యాంక్‌కు అందిస్తారు. కానీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావాలి.  పోగొట్టుకున్న నగదును తిరిగి చెల్లించడానికి ముందు నగదు ఏ విధంగా డ్రా అయింది అనేది బ్యాంకులు పరిశీలన చేస్తాయి. 

నగదు మోసాలే అధికం
ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్లకు సామూహికంగా మెసేజ్‌ అందించే సైబర్‌ వంచకులు కోట్లాది రూపాయలు విలువ చేసే లాటరీ డ్రాలో గెలుపొందారని తెలుపుతారు. దీనిని నమ్మిన అమాయకులు వంచకులు ఇచ్చిన ఈ–మెయిల్‌ ఐడీని సంప్రదిస్తే లాటరీ డ్రా గెలుపొందడం గురించి బోగస్‌ పత్రాలు పంపించి వివిధ పీజుల పేరుతో తమ అకౌంట్లకు  నగదు జమ చేయించుకుంటారు. అదే విధంగా డెబిట్, క్రెడిట్‌ కార్డులు అవధి ముగిసింది, బ్యాంక్‌ అకౌంట్‌కు ప్యాన్‌కార్డు, ఆధార్‌ కార్డు అనుసంధానం చేయాలని తదితర వాటిపేర్లతో ప్రజలకు ఫోన్లు చేస్తారు. వీటిని నమ్మిన ప్రజలు వంచకులకు సమాచారం అందించి తమ మొబైల్‌ నెంబర్లకు వచ్చే ఓటీపీ నెంబరు అందిస్తే వంచకుల ముఠా వలలో చిక్కుకుంటున్నారు.  వివిధ కంపెనీల పేరుతో నకిలీ కస్టమర్లు సేవా సంఖ్యను గూగుల్‌లో వంచకులు పెడుతుండటంతో వాటిని నమ్మిన ప్రజలు ఆ నెంబర్లకు ఫోన్లు చేస్తే వారి వివరాలు తీసుకుని నగదు దోచేస్తున్నారు. వధూవరుల వెబ్‌సైట్స్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యకిలీ అకౌంట్ల స్నేహం సంపాదించి గిప్టులు పంపిస్తామని చెప్పి నగదు తీసుకుని వంచనకు పాల్పడుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top