చుట్టపు చూపుగా వస్తే.. తన్ని పంపించారు

Cousins Stolen Brother In Law Purse in Banjara Hills - Sakshi

బంజారాహిల్స్‌: తాగుడుకు బానిసలైన బావమరుదులు తమ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన బావ జేబుకే కన్నం వేయడమే కాదు అడ్డుకున్నందుకు అతడిపై దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేటకు చెందిన చంద్రకళ సోదరుడు సదానంద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 2లోని ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. ఇటీవల చంద్రకళ కుమారుడు సతీష్‌ భార్య చనిపోవడంతో నిద్ర చేసేందుకు గాను ఆమె తన కుమారుడితో కలిసి బుధవారం మధ్యాహ్నం ఇందిరానగర్‌లోని అన్న ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి పీకలదాకా మద్యం సేవించి వచ్చిన సదానంద్‌ కుమారులు సందీప్, అర్జున్, మహేష్, శ్రీనివాస్‌ తదితరులు మరింత మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని బావ సతీష్‌ను కోరారు. అతను తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో బలవంతంగా అతడి జేబులో ఉన్న రూ. 10 వేలు లాక్కున్నారు. అందుకు అతను అడ్డుపడటంతో తీవ్రంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదు  మేరకు పోలీసులు సందీప్, అర్జున్, మహేష్, శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top