ప్రాణాలు తీసిన వేగం

Couple Died in Bike Accident Visakhapatnam - Sakshi

యం.బెన్నవరం వద్ద ఢీకొన్న బైక్, ఆటో

ఇద్దరి దుర్మరణం ఆరుగురికి తీవ్ర గాయాలు

నాతవరం(నర్సీపట్నం): మితిమీరిన వేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. పని కోసం వెళ్తున్న ఓ తాపీమేస్త్రీ, వేరే దగ్గర ఉంటున్న కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్తున్న బృందంలో ఓ మహిళ గమ్యస్థానాలకు చేరకుండానే మృత్యువాత పడ్డారు. నర్సీపట్నం–తుని ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఆటో,బైక్‌ ఢీకొన్న ప్రమాదం లో  ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో గునుపూడి గ్రామానికి చెందిన గిడుతూరు దుర్గాప్రసాద్, పలకా సతీష్‌ అనే ఇద్దరు తాపీమేస్త్రీలు  నర్సీపట్నంలో పనిచేయడానికి  బుధవారం ఉదయం బైక్‌ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్, నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న ఆటో మండలంలో యం.బెన్నవరం   సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జి.దుర్గాప్రసాద్‌ (23) అక్కడికక్కడే మృతి చెందగా, బైక్‌పై వెనుక  కూర్చొన్న పలకా సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి.  ఆటోలో ప్రయాణిస్తున్న  రోలుగుంట మండలం  బుచ్చెంపేట గ్రామానికి చెందిన ద్వారంపూడి వరలక్ష్మి(45) అనే మహిళ రోడ్డుపైకి తుళ్లిపోయి, తీవ్రంగా గాయపడి అక్కడక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్, మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.

ఆటోలో ప్రయాణిస్తున్న నక్కా వరహలమ్మ, ద్వారంపూడి మంగ,  ద్వారంపూడి సన్యాసమ్మ,  ద్వారంపూడి రాజుబాబుకు తీవ్రగాయాలయ్యాయి.  ఆటోడ్రైవర్‌ మునగపాక లోవరాజు  కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా రోలుగుండ మండలం బుచ్చెంపేట గ్రామం నుంచి నాతవరం మండలం గాంధీనగరంలో గల తమ కుటుంబ సభ్యుల ఇంటికి పిండి వంటలు  పట్టుకుని  ఆటోబయలుదేరారు. మార్గ మధ్యం లో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంపై నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి  తరలించారు. ఈ ప్రమాదంలో బైక్‌  పూర్తిగా నుజ్జయింది,   ఆటో కూడా దెబ్బతింది. ప్రమా ద స్థలంలో పడి ఉన్న రెండు మృతదేహాలు, తీవ్ర గ్రాయాలతో రోదిస్తున్న క్షతగ్రాతులను చూసిన వారంతా చలించిపోయారు. రెండువా హనాలు మితి మీరిన వేగంతో  రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.  నాతవరం ఎస్‌ఐ జిమ్మయ్యవలస రమేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరీశీలించిన ఏఎస్పీ  
ప్రమాద స్థలాన్ని ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి పరిశీలించారు. మంగళవారం  ఇదే రోడ్డులో శృంగవరం వద్ద జరిగిన బైక్‌ ప్రమాదంలో వ్యక్తి  మృతి చెందిన ప్రాంతాన్ని కూడా ఆయన  పరిశీలించారు. ఏఎస్పీతో పాటు నర్సీపట్నం  రూరల్‌ సీఐ అప్పలనాయుడు,  ఎస్‌ఐ రమేష్‌ ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top