వివాహమైన ఆరు నెలలకే పోలీసు ఆత్మహత్య

Constable Commits Suicide In Tamil nadu - Sakshi

అన్నానగర్‌: తిరుచ్చి ప్రత్యేక బృందం పోలీస్‌ క్వార్టర్స్‌లో గురువారం సాయంత్రం ఉరి వేసుకుని పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం జరిగిన ఆరు నెలల్లోనే కుటుంబసమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పుదుకోట జిల్లా కీరనూరుకి చెందిన సేతుపతి (24). ఇతను తిరుచ్చి కిరాపట్టిలో ప్రత్యేక పోలీసుల బృందంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య ఇంద్ర (21). వీరిద్దరూ ప్రత్యేక బృందం పోలీస్‌ క్వార్టర్సులో ఎం.బ్లాక్‌లో నివసిస్తున్నారు. వీరికి వివాహం జరిగి ఆరు నెలలు అవుతుంది. ఇంద్ర ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఈ స్థితిలో ఇంద్రకి హఠాత్తుగా గురువారం కడుపునొప్పి ఏర్పడింది.

అనంతరం ఆమెని చికిత్స కోసం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రితో సేతుపతి చేర్చాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఇంద్ర తల్లిదండ్రులు, సోదరుడు, బంధువులు ఆస్పత్రికి వచ్చారు.  ఆ సమయంలో వారు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ సేతుపతితో గొడవ పడ్డారు. అనంతరం ఆస్పత్రి నుంచి సేతుపతి ఇంటికి వెళ్లాడు. ఈ స్థితిలో సాయంత్రం సేతుపతి సెల్‌ఫోన్‌కి ఇంద్రా ఫోన్‌ చేసింది. అతను ఫోన్‌ ఎత్తలేదు. దీంతో ఇంటి సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం తెలిపి చూడమని తెలిపింది. వారు వచ్చి చూసినప్పుడు సేతుపతి ఉరికి వేలాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న ఎడుమలైపట్టి పుదూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సేతుపతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ వస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో భార్య కుటుంబీకులతో ఏర్పడిన తగాదాలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top