హాస్య నటుడిపై కేసు

Comedian taranga vishwa arrest in Harassment case - Sakshi

యశవంతపుర : శ్యాండల్‌వుడ్‌ హాస్యనటుడు తరంగ విశ్వపై బెంగళూరు చెన్నమ్మనకెరె పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు.   ఉత్తరహళ్లి సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ మహిళ తరంగ విశ్వ, అతని స్నేహితుడు పుట్టస్వామిపై ఫిర్యాదు చేశారు. అదే అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న తరంగ విశ్వ తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడని చెన్నమ్మనకెరె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సదరు మహిళ పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top