అనారోగ్యంతో సీఐ ఆత్మహత్య!

CI Suryanarayana Commits Suicide In ViJayawada - Sakshi

సాక్షి, విజయవాడ: సాక్షి, విజయవాడ: అనారోగ్య కారణాలతో  సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్‌పేట పోలీస్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా  విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగానే సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. 

కుటుంబసభ్యుల్ని పరామర్శించిన డీసీపీ
కాగా ఆత్మహత్య చేసుకున్న సీఐ సూర్యనారాయణ కుటుంబసభ్యులను డీసీపీ విజయరావు పరామర్శించారు. గురువారం ఉదయం సీఐ నివాసానికి వెళ్లిన ఆయన...సూర్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ..‘సూర్యనారాయణ లివర్‌ సోరియాసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స చేయించుకుంటున్నారు. మూడు నెలల క్రితం బావమరిది కూడా మృతి చెందడంతో మరింత క్రుంగిపోయారు. సూర్యనారాయణ కుటుంబానికి పోలీస్‌ శాఖ అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top