మోసం చేసి పెళ్లి చేసుకుంది!

cheating case on women for hiding first marriage - Sakshi - Sakshi

 మొదటి పెళ్లిని దాచిపెట్టిన యువతి

మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న వైనం

పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండో భర్త

ఛీటింగ్‌ కేసు నమోదు

కృష్ణా, కానూరు (పెనమలూరు): ఒక వ్యక్తితో మొదటి పెళ్లి జరిగిన విషయాన్ని చెప్పకుండా  మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న యువతి, అందుకు సహకరించిన ఆమె తండ్రిపై పెనమలూరు పోలీసులు సోమవారం ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు.పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరు తులసీనగర్‌కు చెందిన అంచె భానుప్రకాష్‌ (36)  2009 సంవత్సరం ఫిబ్రవరిలో కోడూరు మండలం నరసింహాపురానికి చెందిన గంటా రేణుకను వివాహం చేసుకన్నాడు.వీరి వివాహాన్ని రేణుక తండ్రి పద్మాకరరావు విజయవాడలో చేశాడు. వీరికి ఓ పాప పుట్టింది. ఈ నేపథ్యంలో భానుప్రకాష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.భార్య కూడా తాను అక్కడే వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పింది.

ప్రతిరోజూ ఉద్యోగానికని ఆమె వెళ్లి వస్తుండేది. కాగా భానుప్రకాష్‌కు భార్య ఉద్యోగంపై అనుమానం వచ్చి వాకబు చేయగా ఆమె ఉద్యోగం చేయడం లేదని తేలింది.దీంతో ఆమెను భర్త నిలదీయగా అతనితో తగాదా పెట్టుకుని మే 2016లో భర్తను వదలివెళ్లిపోయింది.కాగా భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఆమె కుటుంబ వివరాలు సేకరించగా ఆమెకు 2006లోనే హైదరాబాద్‌లోని ఓ వ్యక్తితో వివాహం జరిగిందని తెలిసింది. దీంతో ఈ విషయాన్ని పెళ్లి సమయంలో తనకు చెప్పలేదని, తనను ఆమె, ఆమె తండ్రి మోసం చేశారని భానుప్రకాష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు రేణుక, ఆమె తండ్రి పద్మాకరరావుపై ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top