ఘోరప్రమాదం; ముక్కలైన కారు

Car rams into a tree In Sehore Accident - Sakshi

సేహూర్‌ : వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో మూడు ముక్కలుగా విరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌-ఇండోర్‌ హైవేపై శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది.

టైరు పేలినట్లు పెద్ద శబ్ధం రావడంతో పరుగున వెళ్లామని, అక్కడి దృశ్యాలు చూసి స్థాణువైపోయామని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన కారు(నంబర్‌ MP 20 CB 4656) జబల్‌పూర్‌ వాసులదిగా గుర్తించామని, మితిమీరిన వేగం వల్లే దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తునాతునకలైన కారు..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top