గచ్చిబౌలిలో కారు బీభత్సం..

Car Rams Into Pedestrians At Gachibowli Triple IT Junction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని గచ్చిబౌలిలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వైపు వేగంగా దూసుకొచ్చిన హోండా కారు సిగ్నల్‌ జంప్‌ చేసి పాదాచారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాదాచారులు, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా.. అందులో ఉన్న యువకులు కారు ఆపకుండా పారిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భీతిల్లి పోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్‌ చేసి, కారును సీజ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top