ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

Boyfriend died In Front Of Lover House In Warangal - Sakshi

సాక్షి, తాడ్వాయి(వరంగల్‌) : ప్రియురాలి ఇంటి ఎదుట ఓ ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా సమ్మక్క– సారలమ్మ తాడ్వాయి మండలం కాల్వపల్లిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తాడ్వా యి ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన జక్కుల మహేందర్‌(25), కాల్వపల్లికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. మహేందర్‌ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇటీవలన ఇరువురి బంధువులు, పెద్ద మనుషులు అమ్మాయిని పిలిపించి మాట్లాడారు. ఈ క్రమంలో అమ్మాయి మహేందర్‌ను ప్రేమించలేదని చెప్పింది. దీంతో మనస్థాపానికి గురైన మహేందర్‌ బుధవారం రాత్రి కాల్వపల్లిలోని అమ్మాయి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్‌  వివరించారు. గురువారం మృతుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top