పెళ్లికి ఒత్తిడి చేయడంతో హత్య చేశా!

Boy Murder Girl For Forcing To Marriage In Tamilnadu - Sakshi

పోలీసులకు యువకుడి వాంగ్మూలం

టీ.నగర్‌: వివాహానికి ఒత్తిడి చేయడంతో బావిలో తోసి హత్య చేశానని కళాశాల విద్యార్థిని హత్య కేసులో అరెస్టు అయిన యువకుడు శనివారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. విల్లుపురం జిల్లా కచ్చిరాయన్‌పాళయం సమీపం మాధవచ్చేరి గ్రామానికి చెందిన వేంగైముత్తు (45)కు వీరమ్మాళ్‌(18) సహా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరమ్మాళ్‌ సేలం జిల్లాలోగల ఒక ప్రైవేటు కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం నుంచి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న పాడుబడిన బావిలో వీరమ్మాళ్‌ శవంగా తేలింది.

సమాచారం అందుకున్న కచ్చిరాయన్‌ పాళయం పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి విచారణ జరిపారు. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపగా అందులో రాజు (24) అనే యువకుడు వీరమ్మాళ్‌ను బావిలోకి తోసి హతమార్చినట్లు నేరం అంగీకరించాడు. అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను, వీరమ్మాళ్‌ కొన్నేళ్లుగా ప్రేమిస్తూ వచ్చామని అయితే ఆమె తనను వివాహానికి ఒత్తిడి చేయడంతో బావిలోకి తోసేసి హతమార్చినట్లు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top