బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

boy kidnap case solve begging couple arrested

ఎత్తుకెళ్లిన యాచక దంపతులు

తణుకులో అరెస్ట్‌ చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురంలో కలకలం సృష్టించిన బాలుడు కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమయ్యింది. సంచార భిక్షాటన చేసే దంపతులు బాలుడిని కిడ్నాప్‌ చేశా రు. బాలుడితో పాటు దంపతులిద్దరినీ తణుకులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు తన కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని అరుంధతిపేటకు చెందిన కంకిపాటి సం తోష్‌కుమార్‌ (8) రెండో తరగతి చదువుతున్నాడు. తండ్రి మృతిచెందడం, తల్లి కవిత గల్ఫ్‌లో ఉండటంతో నాయనమ్మ అమ్మాజీ వద్ద పెరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం కిడ్నాప్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు పోలీసులు బృందాలుగా ఏర్పడి ద ర్యాప్తు చేపట్టారు. పార్కురోడ్డులో ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి కూడా సంతోష్‌ను తీసుకెళుతున్నట్టుగా సీసీ కెమెరా పుటేజ్‌ ద్వారా గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

కిడ్నాప్‌ జరిగిందిలా..
నరసాపురం పార్కురోడ్డులోని పాండురంగస్వామి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అన్నసమారాధన జరుగుతుంది. అన్నసమారాధనకు సంచార యాచకులు అల్లం ఏసు, అతని భార్య దేవి వచ్చారు.  అదే సమయంలో బాలుడు సంతోష్‌ కూడా పార్కువద్దకు ఆడుకోవడానికి వచ్చి యాచకుల సంచిలో వస్తువులు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో వారు బాలుడిని పట్టుకుని గదమాయించారు. ఈ సందర్భంలో సంతోష్‌ తనకు తల్లితండ్రులు లేరని చెప్పడంతో యాచనకు పనికొస్తాడని భావించి, సొమ్ములు ఆశ చూపి చేతికి రుమాలు కట్టి తమతో తీసుకువెళ్లి పోయారు. రైలులో యాచక దంపతులతో పాటు సంతోష్‌ పాలకొల్లు, నిడదవోలు, తణుకు ప్రాంతాలు తిరిగాడు. మూడు రోజులుగా సంతోష్‌తో భిక్షాటన చేయిస్తూ బాగా తిండి కూడా పెట్టారని సీఐ వివరించారు. సోమవారం ఉదయం తణుకులో వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వాస్తవంగా పెనుగొండ ప్రాం తానికి చెందిన యాచకుల దంపతులకు ఎక్కడా నివాస గృహం లేదన్నారు. కేసు దర్యాప్తులో కానిస్టేబుళ్లు ఎంవీ సంపత్‌కుమార్, ఏకే సత్యనారాయణ, బి.వేణుగో పాల్‌ చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. టౌన్‌ రెండో ఎస్సై రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top