ప్రియురాలి ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన యువకుడు

Boy Friend Posting Lover Photos In Whatsapp Status She Commits Suicide - Sakshi

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

తమిళనాడు, కాంచీపురం: ప్రేమించిన నాటి ఫొటోలను ప్రియుడు వాట్సా ప్‌లో పెట్టడంతో మనస్తాపం చెందిన ప్రేయసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాంచీపురం సమీపంలోని కలక్కాడు ప్రాంతానికి చెందిన దామోదరన్‌ కుమార్తె జీవా(21). కాంచీపురం సమీపంలోని కీల్‌ అంబి ప్రాంతంలో ఉన్న తిరుమలై ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కన్నన్‌ను ప్రేమించింది. అయితే కన్నన్‌ ప్రవర్తన నచ్చకపోవడంతో ఇటీవల కన్నన్‌తో మాట్లాడడం మానేసింది.

పలుమార్లు కన్నన్‌ ప్రయత్నించినా జీవా అతడితో మాట్లాడలేదు. దీంతో ఆవేశం చెందిన కన్నన్‌ తాను జీవాతో కలిసి తీసుకున్న ఫొటోలను వాట్సాప్‌లో పెట్టాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన జీవా బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మగరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జీవా మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కాంచీపురం జీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top