ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

Auto Driver Murdered in Chittoor - Sakshi

ఆస్తి తగాదాలే కారణమా..?

పోలీసుల అదుపులో అనుమానితులు..?

చిత్తూరు, కుప్పంరూరల్‌ : ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురైన సంఘటన కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాగిమానుమిట్టకు చెందిన బాబుఖాన్‌ (47) ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఉన్న తగాదాల కారణంగా పదేళ్ల కిందటే కాపురాన్ని కుప్పం పట్టణానికి మార్చాడు. అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యంతాగి స్వగ్రామానికి వెళ్లాడు. గ్రామంలో ఏం జరిగిందో తెలియదు కానీ, బాబుఖాన్‌ దారుణంగా హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి సమీపంలోని మామిడితోటలో పడేశారు. అతని గొంతుకోసి తలపై బండతో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లినవారు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ లోకేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ జీటీ.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబుఖాన్‌ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.ఆస్తి

తగాదాలే కారణమా..?
బాబుఖాన్‌కు, అతని అన్నదమ్ముల మధ్య కొంతకా లంగా ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలిసింది. శనివారం రాత్రి అన్నదమ్ముల పిల్లలు, బాబుఖా న్‌ మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. వివాదం ముదిరి హత్యకు దారితీసి ఉంటుందని భావిస్తున్నారు.

పోలీసుల అదుపులో అనుమానితులు..!
డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆది వారం సాయంత్రం వరకు విచారించినా ఎలాంటి సమాచారం రాలేదని తెలిసింది. రాత్రి కూడా వారు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top