రామంతాపుర్‌లో దారుణం.. చిన్నారిని ఢీకొట్టిన ఆటో

5 Years Old child Hit By Auto in Ramanthapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌, రామంతాపుర్‌లో దారుణం చోటుచేసుకుంది. అతివేగం అభం శుభం తెలియని ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లి, తండ్రితో కలిసి సరదాగా నడుచుకుంటున్న వెళ్తున్న ఆ చిన్నారిని వేగంగా దూసుకొచ్చిన ఆటో పొట్టన బెట్టుకుంది. స్థానికంగా నివసించే ఉమేశ్‌ తన భార్య, పిల్లలతో కలిసి కిరాణ షాప్‌కు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఉమేశ్‌ కుమారుడు మోహిత్‌ (5)ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు.

ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అప్పటి వరకు తమతోనే ఉన్న కుమారుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. వారి ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా అయ్యోపాపం అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top