ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

5 Year Old Suffocates to Death Inside Ice Cream Trolley - Sakshi

లక్నో: ‘హైడ్‌ అండ్‌ సీక్‌’  ఆట ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. తన స్నేహితులకు సులువుగా దొరకవద్దని భావించి ఐస్‌క్రీమ్‌ ట్రాలీలో దాక్కున్న ఆ చిన్నారి.. వారికి అందనంత దూరం వెళ్లిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కలినగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతర్వ్‌ గుప్తా(5) అనే నర్సరీ విద్యార్థి చాలా సేపటి నుంచి కనబడకపోవడంతో అతని తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చిన్నారి కుటుంబ సభ్యుడొకరు వారి ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న ఐస్‌క్రీమ్‌ ట్రాలీ మూతను తీయగా అందులో శవమై కనిపించాడు.

దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. అప్పటి వరకు తమ ముందే ఆడుకున్న కొడుకు ఇకలేడనే విషయాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం ఆడుకుంటూ చిన్నగా గాయపడటంతో తన కొడుకును సోమవారం బడికి పంపించలేదని, పంపించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని చిన్నారి తండ్రి అజయ్‌గుప్తా ఆవేదన వ్యక్తం చేశాడు. హైడ్‌ అండ్‌ సీక్‌ ఆడుతూ చిన్నారి ఐస్‌క్రీమ్‌ ట్రాలీలో దాక్కున్నాడని, అయితే దాని డోర్‌ ప్రమాదవశాత్తు లాక్‌ అవ్వడంతో చిన్నారి ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top