ప్రవర్తనలో మార్పు.. ఏంటని ప్రశ్నించగా..

13 Year Boy Molested By Four Teenagers In Kurla - Sakshi

ముంబై : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు అతడి స్నేహితులు. నెల రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే భయపడేస్థితికి తెచ్చారు. ఈ సంఘటన ముంబైలోని డోంగ్రీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై కుర్లాలోని నెహ్రూ నగర్‌కు చెందిన ఓ బాలుడు నలుగురు స్నేహితుల చేతిలో లైంగిక దాడికి గురయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు అతడిని చిత్రహింసలు పెట్టారు వారు. దీంతో సదరు బాలుడు ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరస్థితి ఏర్పడింది. అతడిలో చోటుచేసుకున్న మార్పుల్ని గుర్తించిన తల్లిదండ్రులు ఏంటని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

అయితే వారు గట్టిగా అడిగే సరికి.. కింద కూర్చోవటానికి నొప్పిగా ఉంటోందని చెప్పాడు. దీంతో వారతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడు అత్యాచారానికి గురయ్యాడని ధ్రువీకరించారు. కౌన్సిలింగ్‌ సమయంలో బాలుడు తనపై నెల రోజులుగా జరిగిన దాడిని వివరించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆ నలుగురిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు.  వారిని డోంగ్రీ రిమాండ్‌ హోమ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top