అక్కడ 12 లక్షల మందికి గన్‌ లైసెన్స్‌లు

12.77 lakh gun licences in UP: MHA 

సాక్షి,న్యూఢిల్లీః దేశంలో అత్యధిక గన్‌ లైసెన్స్‌లు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌ ముందువరసలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 12.77 లక్షల మంది గన్‌ లైసెన్స్‌ కలిగి ఉన్నారు. 3.69 లక్షల గన్‌ లైసెన్స్‌లతో ఉగ్రవాద ప్రభావిత జమ్మూ కశ్మీర్‌ తర్వాతి స్ధానంలో నిలిచింది. ఇక 2016,డిసెంబర్‌ 31 నాటికి దేశవ్యాప్తంగా 33 లక్షల 69వేల444 మంది యాక్టివ్‌ గన్‌ లైసెన్స్‌దారులు ఉన్నట్టు హాంమంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. అత్యధిక గన్‌ లైసెన్స్‌లు కలిగి ఉన్న రాష్ట్రంగా ముందున్న యూపీలో ఎక్కువ మంది వ్యక్తిగత భద్రత పేరిట గన్‌ లైసెన్సులు పొందారు.

2011 జనాభా లెక్కల ప్రకారం యూపీ జనాభా దాదాపు 20 కోట్లుగా ఉంది. ఇక దశాబ్ధాల తరబడి ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్‌ తర్వాతి స్ధానంలో ఉంది. 1980, 90ల్లో తీవ్రవాద సమస్యను ఎదుర్కొన్న పంజాబ్‌లో 3 లక్షల 69వేల191 గన్‌ లైసెన్స్‌లున్నాయి. వీటిలో అత్యధిక లైసెన్సులు ఆ రాష్ట్రంలో తీవ్రవాద సమస్య అధికంగా ఉన్న సమయంలో ఇచ్చినవే కావడం గమనార్హం.ఇక మధ్యప్రదేశ్‌లో 2 లక్షల 47వేల 130 యాక్టివ్‌ గన్‌ లైసెన్స్‌లున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్‌, డయూ, దాద్రా, నగర్‌ హవేలిల్లో గన్‌లైసెన్స్‌ల సంఖ్య అతితక్కువగా ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top