శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి కుటుంబం

సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మంత్రి నారా లోకేష్‌, హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

శనివారం సాయంత్రం నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాత్రి అక్కడే బసచేశారు. ఆదివారం ఉదయం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమల చేరుకుని వెంకన్నను దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top