టెక్సాస్‌లో విప్రో టెక్‌ సెంటర్‌

Wipro opens tech center in Texas for advanced analytics - Sakshi

న్యూఢిల్లీ: దేశీ మూడో అతిపెద్ద ఐటీ సర్వీసెస్‌ కంపెనీ ‘విప్రో’ తాజాగా టెక్సాస్‌లోని ప్లానో ప్రాంతంలో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రానున్న కొన్నేళ్లలో టెక్సాస్‌లో ఉద్యోగుల సంఖ్యను 2,000కు పెంచుకుంటామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,400గా ఉంది.

అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో రక్షణాత్మక ధోరణులు పెరుగుతోన్న నేపథ్యంలో మన ఐటీ కంపెనీలు వాటి వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. స్థానికంగానే ఎక్కువగా మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కాగా విప్రో కంపెనీ గత దశాబ్ద కాలంలో అమెరికాలో 2 బిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌  చేసింది. కంపెనీకి అమెరికా వ్యాప్తంగా 40కిపైగా ఫెసిలిటీలు ఉన్నాయి. 13,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top