ఈపీఎఫ్‌ బదిలీ ఇక సులువు

What Are The Benefits Of Aadhaar-Backed UAN? EPFO Explains

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సబ్‌స్క్రైబర్లకు శుభవార్తే. ఈపీఎఫ్‌ బదిలీ ప్రక్రియ సులభతరమయ్యిం ది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగులు తమ పీఎఫ్‌ మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మా ర్చుకోవటానికి ఇకపై ఫామ్‌–13 వంటివి సమర్పించాల్సిన అవసరం ఉండదు. వారి పాత ఖాతాలోని సొమ్ము కొత్త ఖా తాకు ఆటోమేటిగ్గా మారిపోతుంది.

ఇందుకు కొత్త ఉద్యోగంలో– అక్కడి యజమానికి కొత్తగా రూపొందించిన ఫారం –11లో తన పాత పీఎఫ్‌ నంబరు వంటి వివరాలను అంది స్తే చాలు. పీఎఫ్‌ నిధులు ఆటోమేటిగ్గా బదిలీ అవుతాయి. ఈ ఫారంలో ఆధార్, బ్యాంకు వివరాలు వంటివి ఉంటాయి కనక అవన్నీ యజమాని ద్వారా పీఎఫ్‌ కార్యాలయానికి చేరుతాయి. ఇటీవలే ఈపీఎఫ్‌ఓ తన ఖాతాదారులు ఉద్యోగం మారినపుడు వివరాలన్నీ ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా మార్చుకునే వెసులుబాటునూ కల్పించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top