భారత్‌ వచ్చేందుకు మాల్యా సంసిద్ధత?

Vijay Mallya in talks to return to India voluntarily - Sakshi

న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా .. విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్నారు. తన సంసిద్ధతకు సంబంధించి విచారణాధికారులకు సంకేతాలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పలాయనంలో ఉన్న ఎగవేతదారులకు దేశంలో, విదేశాల్లో ఉండే ఆస్తులను చట్టపరంగా జప్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మూతబడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో మాల్యా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ల విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆయన ఉంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top