వడ్డీ రేట్లలో మార్పులుండవు

Tinkering in rates by banks unlikely in short-term: HDFC Bank - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అంచనా

న్యూఢిల్లీ: స్వల్పకాలంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకుల్లో ఉన్న అధిక లిక్విడిటీ ఖాళీ అయిపోతోందని, దీంతో వడ్డీ రేట్ల తగ్గుదల నిలిచిపోయినట్టేనని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిప్యూటీ ఎండీ పరేష్‌ సుక్తంకర్‌ స్పష్టం చేశారు. డిపాజిట్‌ రేట్లు, వడ్డీ రేట్లు దాదాపు కనిష్ట స్థాయికి చేరినట్టేనని, ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇప్పట్లో వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి మొదలైంది. ఈ దృష్ట్యా ఆర్‌బీఐ తదుపరి వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశాలు లేనట్టే’’  అని సుక్తంకర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top