ఒడిదుడుకుల మధ్య స్టాక్‌మార్కెట్లు

Stockmarkets  remains Flat - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో  మొదలయ్యాయి. అయితే గ్లోబల్‌ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో  ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.     లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న  సెన్సెక్స్‌ , నిఫ్టీ ఫ్లాట్‌ ఎక్కడివక్కడే అన్నట్టుకొనసాగుతున్నాయి.  ఫార్మా, ఐటీ పాజిటివ్‌గా ఉన్నాయి.
డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, సన్‌ ఫార్మా, అరబిందో, సిప్లా, పిరమల్‌, బయోకాన్‌  లాభాపడుతున్నాయి.  అలాగే హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి.  అయితే గ్రాసిమ్‌, హిందాల్కో, హీరోమోటో, పవర్‌గ్రిడ్‌, యస్‌బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, బజాజ్‌ ఫిన్‌, ఎన్‌టీపీసీ నష్టపోతున్నాయి.

అటు కరెన్సీ మార్కెట్‌ డాలర్‌ మారకంలో రూపాయి 29పైసలు నష్టపోయి67.93 వద్దుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పుత్తడి  రూ.241 రూపాయలకు పైగా ఎగిసి 10 గ్రా. 31, 284 వద్ద ఉంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top