నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

stockmarkets opens with Flat note - Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాలతో  ప్రారంభమైనాయి.  అనంతరం  ప్రారంభ లాభాలను బాగా తగ్గించుకొని ఫ్లాట్‌గా మారింది. సెనెక్స్‌ 60 పాయింట్లు ఎగిసి 33374 వద్ద, నిఫ్టీ   నిప్టీ 5 పాయింట్ల లాభంతో 10,326 వద్ద  ట్రేడ్‌ అయినా.. భారీ అమ్మకాల ఒత్తిడితో వెంటనే నష్టాల్లోకి మళ్లాయి.  అటు బ్యాంక్‌ నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. ఐటీ,  స్మాల్‌కాప్స్‌​  బాగా లాభపడుతున్నాయి.   ముఖ్యంగా  శనివారం ప్రకటించిన కొత్త జీఎస్‌టీ  పన్నుల శ్లాబుల మార్పులతో సంబంధిత షేర్లు బాగా లాభపడుతున్నాయి.  అయితే ఫార్మ మాత్రం నష్టాల్లో ఉంది.

యాక్సిస్‌, ఎస్‌బీఐ, కరూర్‌ వైశ్యా ,హెచ్‌యూఎల్‌,  ఐటీసీ,  గోద్రెజ్‌, జ్యోతి లాబ్స్‌,  నెస్లే షేర్లలో  జీఎస్‌టీ రిలీఫ్‌ కనిపిస్తోంది.  ఎంఅండ్‌ఎం,ఐషర్‌ లాభాల్లోనూ,  ఓఎన్‌జీసీ, ఎల్‌అంఢ్‌టీ, కోల్‌ ఇండియా, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టాల్‌, భారతీ నష్టపోతున్నాయి.  మరోవైపు టవర్‌ బిజినెస్‌ విక్రయం వార్తలతో ఆరంభంలో 5శాతంపైగా లాభపడిన   కౌంటర్‌ తరువాత నష్టాల్లోకి మళ్లింది.  3 శాతానికిపై నష్టపోయి ట్రేడ్‌ అవుతోంది.
 

Back to Top