జీడీపీ, ఒపెక్‌ షాక్‌:మార్కెట్ల భారీ పతనం

stockmarkets  huge fall on gdp, opec,etc.. - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాలతో ముగిశాయి. రెండో త్రైమాసికపు జీడీపీ గణాంకాలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ముగింపు  నేపధ్యంలో  సూచీలు పతనాన్ని నమోదు చేశాయి. దీనికి తోడు క్రూడాయిల్ ఉత్పత్తిని మరో 9నెలలపాటు  తగ్గించేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయించడంతో సెంటిమెంట్ మరింత నెగటివ్‌గా మారింది. ముఖ్యంగా బ్యాంక్‌నిఫ్టీ బాగా నష్టపోయింది.  చివరికి సెన్సెక్స్  33,300 పాయింట్లకి దిగువకు, నిఫ్టీ 10,300 పాయింట్ల మార్క్‌ను  కోల్పోయింది.   సెన్సెక్స్‌ 453పాయింట్ల నష్టంతో33,149 వద్ద,నిఫ్టీ 135 పాయింట్లుదిగజారి 10,226 వద్ద ముగిసింది. ఆటో , ఫార్మా, మెటల్స్ రియాల్టీ ఇండెక్స్ నష్టాల్లో ముగిశాయి. గత రెండు నెలలలో భారీ సింగిల్‌ డే పతనాన్ని నమోదు చేయగా మిడ్‌ క్యాప్‌, రెండువారల్లో అతిపెద్ద పతనానికి గురయ్యాయి.
 

మెక్‌ లాండ్‌ రస్సెల్స్‌,  బజాజ్‌ హోల్డింగ్స్‌, టాటా గ్లోబల్‌ బెవరేజేస్‌, డాబర్‌, బాష్‌, గెయిల్‌, ఐడియా లాభపడగా,  ఎస్‌బీఐ, పీఎన్‌బీ,  ఎంఎం ఫైనాన్షియల్‌, ఎల్‌ఐసీ,  హిందాల్కో టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.
మరోవైపు గణాంకాల ప్రకటనతో రూపాయి  పతనం నుంచి కోలుకుంది.  వీటితో పాటు  రిలయన్స్‌, ఐటీసీ, టాటా స్టీల్‌ లాంటి దిగ్గజాలు నష్టాల్లోనే ముగిశాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top