నష్టాలు ముగింపు

Stockmarkets end with 108  points ends  down - Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్‌108 పాయింట్లుక్షీణిం చి 34,903వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల పతనంతో10593వద్ద క్లోజ్‌ అయింది. . తద్వారా 35వేల మార్క్‌ దిగువకు, నిఫ్టీ 10600దిగువరకు చేరాయి. దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా, ప్రధానంగా ఐటీ, రియల్టీ, మెటల్‌  బాగా నష్టపోయాయి. ఐడియా, హెక్సావేర్‌, ఇన్ఫీబీమ్‌, ఆర్‌కామ్‌, జస్ట్‌డయల్‌, ఐఎఫ్‌సీఐ, కేపీఐటీ, నిట్‌ టెక్‌, ఎన్‌సీసీ, అదానీ పవర్‌ నష్టాల్లో ఎం అండ్‌ ఎం,  ఐసీఐసీఐబ్యాంకు నష్టాల్లో ముగిశాయి. అయితే మరోవైపు సిప్లా, మారుతిసుజుకి , టాటా గ్లోబల్‌, ఎంఆర్‌పీఎల్‌, బలరామ్‌ఫూర్, డీసీబీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కంకర్‌, ఆర్‌ఐఎల్‌, భారత్‌ ఫైనాన్స్‌ స‍్వల్పంగా లాభపడ్డాయి.

అ‌టు డాలరు మారకంలో రూపాయి 0.07 పైసలు నష్టంతో 67.18వద్ద ముగిసింది,  ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో  పుత్తడి 50 రూపాయలనుకోల్పోయి  30,653 వద్ద ఉంది.
 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top