దలాల్‌ స్ట్రీట్‌లో లాభాల హోరు

stockmarkets up 250 points  - Sakshi

సాక్షి,ముంబై: దలాల్‌స్ట్రీట్‌ లాభాలదౌడు తీస్తోంది. దాదాపు అన్నిసెక్టార్లలో కొనుగోళ్లతో వరుసగా రెండో రోజు కూడా లాభాల హోరు సాగుతోంది. ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న కీలక సూచీలు మరింత దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 300 పాయింట్ల లాభాలకు చేరువలో ఉంది. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ కూడా ఇదేబాటలో ఉన్నాయి. ఒక దశలో నిఫ్టీ 10,250ని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 62 పాయింట్ల లాభంతో 33,211వద్ద, నిఫ్టీ 80పాయింట్ల లాభంతో 10, 249 వద్ద ట్రేడ్‌అవుతున్నాయి. ప్రధానంగా మెటల్‌లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో కొనగోళ్లునెలకొన్నాయి. జేపీ, ఆర్‌కామ్‌, అజంతా, కావేరీ సీడ్‌, పిరమల్‌, సెయిల్‌, టాటా స్టీల్‌, ఎన్‌బీసీసీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఎస్కార్ట్స్‌ , టైటన్‌, బీహెచ్‌ఎల్‌, లాభాలనార్జిస్తుండగా జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పెట్రోనెట్‌, ఐజీఎల్‌, శ్రీ సిమెంట్‌, యూనియన్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, డిష్‌ టీవీ, ఎన్‌టీపీసీ నష్టాల్లో ఉన్నాయి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top