స్వల్ప లాభాలతో సరి

Stock market update: Pharma stocks bullish, surge up to 5 percent - Sakshi

మూడో రోజూ లాభాలే

జోష్‌నిచ్చిన ఐఐపీ గణాంకాలు  ఫెడ్‌ సమావేశం 

నేపథ్యంలో అప్రమత్తత 47 పాయింట్లు పెరిగి 

35,739కు సెన్సెక్స్‌ 

ఆరంభ లాభాలు ఆవిరైనప్పటికీ, బుధవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. టెక్నాలజీ, ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో వరుసగా మూడో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 47 పాయింట్ల లాభంతో 35,739 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,857 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 295 పాయింట్లు లాభపడింది. క్యాపిటల్‌ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సీజీ, టెలికం, విద్యుత్తు రంగ షేర్లు నష్టపోయాయి. తయారీ, మైనింగ్‌ రంగాల దన్నుతో ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి 4.9 శాతానికి ఎగియడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.అయితే మే రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.87 శాతానికి ఎగియడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 185 పాయింట్ల లాభంతో 35,877 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఫెడ్‌ కీలక సమావేశంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 50  పాయింట్లులాభపడింది. పారిశ్రామికోత్పత్తి 4.9 శాతానికి చేరడంతో గత రెండు రోజుల లాభాలు బుధవారం కూడా కొనసాగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు, 

టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ ! 
శుక్రవారం జరిగే బోర్డ్‌ సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించనున్నామని టీసీఎస్‌ వెల్లడించడంతో టీసీఎస్‌ షేర్‌ జోరుగా పెరిగింది.  2.4 శాతం లాభంతో రూ.1,824 వద్ద ముగిసింది. ఈ షేర్‌ ఈ ఏడాది 34 శాతం, ఏడాది కాలంలో 50 శాతం చొప్పున లాభపడింది. గత ఏడాది టీసీఎస్‌ ఒక్కో షేర్‌ను రూ.2,850 ధరకు మొత్తం రూ.16,000 కోట్ల విలువైన 5.61 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసింది. మరో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆల్‌టైమ్‌ హై, రూ.1,284ను తాకింది. చివరకు 1.4 శాతం లాభంతో రూ.1,276 వద్ద ముగసింది.

ఆల్‌టైమ్‌ హైకి పేజ్‌ ఇండస్ట్రీస్‌...
లో దుస్తుల కంపెనీ జాకీ ఇంటర్నేషనల్‌తో లైసెన్స్‌ ఒప్పందాన్ని 2040 వరకూ పొడిగించడంతో పేజ్‌ ఇంటర్నేషనల్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.26,296ని తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.25,685  వద్ద ముగిసింది. రిలయన్స్‌ జియో తాజా డేటా ప్లాన్‌ కారణంగా భారతీ ఎయిర్‌టెల్‌ 1.3  శాతం, ఐడియా సెల్యులర్‌ కంపెనీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top