రెండు రోజుల లాభాలకు బ్రేక్‌

 Stock market update: Over 100 stocks hit 52-week lows on NSE - Sakshi

నేటి నుంచి అమెరికా  సుంకాల అమలు 

కొనసాగుతన్న విదేశీ   ఇన్వెస్టర్ల అమ్మకాలు

71 పాయింట్లు పతనమై  35,575కు సెన్సెక్స్‌

20 పాయింట్లు నష్టపోయి  10,750కు నిఫ్టీ

రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగిన గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. చైనా వస్తువులపై అమెరికా విధించిన సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 71 పాయింట్లు నష్టపోయి 35,575 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్లు పతనమై 10,750 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన, బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఎనర్జీ, ఫార్మా, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి.  

230 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
గత రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 381 పాయింట్లు లాభపడింది. దీంతో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటంతో మార్కెట్‌కు నష్టాలు వచ్చాయని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల ప్రతికూలతలతో నష్టాల్లోకి జారిపోయింది. ట్రేడింగ్‌ ఆద్యతం లాభ, నష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 103 పాయింట్ల లాభంతో 35,748 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయని తాకింది. మధ్యాహ్నం తర్వాత 127 పాయింట్ల నష్టంతో 35,518 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. రోజంతా మొత్తం మీద 230 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

ఇన్ఫోసిస్‌ 4 శాతం డౌన్‌: 2025 కల్లా ఆదాయం రెట్టింపవ్వగలదని  41వ ఏజీఎమ్‌లో ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.  దీంతో ఇంట్రాడేలో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2% లాభపడింది. చివరకు 2.5 శాతం నష్టంతో రూ. 965వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌ షేర్‌  4.4 శాతం క్షీణించి, రూ.1,284 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఇటీవల వరకూ ఈ షేర్‌ రోజూ కొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ వస్తోంది.  

ఐదేళ్ల కనిస్టానికి టాటా మోటార్స్‌... 
బ్రెగ్జిట్‌ కారణంగా జేఎల్‌ఆర్‌పై ఏడాదికి 120 కోట్ల పౌండ్ల భారం పడనుండటంతో జేఎల్‌ఆర్‌ మాతృసంస్థ, టాటా మోటార్స్‌ ఇంట్రాడేలో ఐదేళ్ల కనిష్టానికి, రూ. 253కు పడిపోయింది. ఈ ఏడాది ఈ షేర్‌ 41 శాతం నష్టపోయింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top