ఆరో రోజూ ఆగని పరుగు

stock market is off to its best start in 31 years and that bodes well for the rest of 2018 - Sakshi

22 పాయింట్ల లాభంతో 36,162కు సెన్సెక్స్‌

స్టాక్‌ సూచీల రికార్డ్‌ల పరంపర బుధవారం కూడా కొనసాగింది. వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి.  నేడు(గురువారం) ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు కావడంతో కొన్ని  షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ట్రేడింగ్‌  ఒడిదుడుకుల మధ్య సాగింది. స్టాక్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మూలధన నిధులతాజా ప్రకటన కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 36,162 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 11,086 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌  36,268 పాయింట్ల, నిఫీ 11,110 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇవి రెండూ ఈ  సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top