10డెలివరీ.కామ్‌ సేవలు ప్రారంభం

Start 10 Delivery.com services - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన డెలివరీ స్టార్టప్‌ 10డెలివరీ.కామ్‌ ప్రాంతీయ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఉచిత పికప్స్, వేగవంతమైన డెలివరీ తమ లక్ష్యమని 10 డెలివరీ.కామ్‌ను ప్రమోట్‌ చేస్తున్న యాడ్‌నిగమ్‌ ఫౌండర్‌ రాజిరెడ్డి కేసిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని వ్యాపారస్తులు, ట్రేడర్లకిది చాలా ఉపయుక్తంగా ఉంటుందని, డాక్యు మెంట్లు, తేలికపాటి పార్సిళ్ల వంటివి తక్కువ ధరలో డెలివరీ చేస్తామని చెప్పారాయన. తొలి ఆర్డర్‌రు రూ.10 ధరకే డెలివరీ చేస్తారు. డెలివరీ చార్జీలు డాక్యుమెంట్స్‌ కిలో వరకైతే రూ.25, పార్సిల్స్‌ 2 కిలో ల వరకైతే రూ.50 వరకూ ఉంటాయని ఆయన తెలిపారు. మైక్రో లాజిస్టిక్‌ నిర్వహణే ఈ కంపెనీ ప్రధాన బలమని.. త్వరలోనే కార్పొరేట్‌ సంస్థలు, బల్క్‌ బుకింగ్‌పై దృష్టిపెడతామని రాజిరెడ్డి తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top