పెట్టుబడుల్లోనూ అదరగొట్టిన స్టీవ్‌ స్మిత్‌

Smith earns around Rs 60cr courtesy 2005 investment  - Sakshi

క్రికెట్‌కంటే.. వ్యాపారంలోనే ఎక్కువ సంపాదించాడు

 ‘కోయలా మాట్రెసెస్‌’లో భారీ పెట్టుబడులు 

కర్టసీగా రూ.60 కోట్లు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ (30) నిషేధం అనంతరం క్రికెట్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటు కోవడమే కాదు.. రాబడుల్లో కూడా అంతే వేగంగా దూసుకుపోతున్నాడు.  మొదటి యాషెస్ టెస్టులో రెండు భారీ సెంచరీలతో అదరగొట్టాడు. ఫలితంగా బర్మింగ్‌హామ్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై 251 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రీఎంట్రీతో క్రికెట్‌ మైదానంలో మెరుపులు మెరిపించడమే కాదు, బిజినెస్‌లోనూ భారీగా ఆదాయాన్ని ఆర్జించినట్టుగా తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. న్యూస్.కామ్.యు నివేదిక ప్రకారం కోయలా మాట్రెసెస్‌లో  పెట్టుబడుల ద్వారా  భారీ ఆదాయాన్ని సొంతం చేసుకున్నాడు.  లక్ష డాలర్ల పెట్టుబడి కాస్తా తాజా విలువ ప్రకారం 12.1 మిలియన్ డాలర్లకు చేరుకుందని ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ (ఎఎఫ్ఆర్) ను ఉటంకిస్తూ ఒక  రిపోర్టును వెల్లడించింది.  

అలాగే కోయల మాట్రెసెస్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా  అయిన స్మిత్‌  జూలై 2015లో 10 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నాడు. అయితే ఈ కంపెనీలో పెట్టుబడికి గాను  కంపెనీ నుంచి లభించిన  కర్టసీ రూపంలో  రూ. 60 కోట్లను  అందుకున్నాడు.  తమ కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పుడు  లాభాల అంచనాలపై  స్మిత్‌ తన మేనేజర్,  తల్లిదండ్రులకు చెప్పడం తనకు ఇంకా గుర్తుందని  కోలా సహ వ్యవస్థాపకుడు మిచ్ టేలర్ సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారుడిగా క్రికెట్‌లో సంపాదించినదాని కంటే.. తమ కంపెనీ వ్యాపారంలోనే కొన్ని రెట్లు ఎక్కువ సంపదను ఆర్జించాడన్నారు.   ఏఎఫ్‌ఆర్‌  అక్టోబర్‌లో  వెలువరించే  యంగ్ రిచ్ లిస్ట్  జాబితాలో స్మిత్‌ సంపద  31 మిలియన్ డాలర్లుగా ఉండనుందని అంచనా.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top