ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు:9700 దిగువకు నిఫ్టీ

Sensex,Nifty off tocautious start ahead of F&O expiry

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌ నోట్‌తోప్రారంభమయ్యాయి.  వరుసగా ఎనిమిదవ రోజు కూడా మార్కెట్లలోబలహీనత కొనసాగుతోంది.  కీలక సూచీల్లో సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 31,111 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో  9700 స్థాయి ని  బ్రేక్‌ చేసింది. ఎఫ్‌  అండ్‌ వో సిరీస్‌ ముగింపు కారణంగా ఇన్వస్టర్ల అప్రమత్తత , అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల వాతావరణం  మన మా ర్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ , ఫార్మ సెక్టార్‌ వీక్‌గా, రియల్టీ ఐటీ స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి.  సన్‌టీవీ, దివీస్‌, రిలయన్స్‌ ఎల్‌ఐసీ,బీహ్‌చ్‌ఈఎల్‌  డాబర్‌  లాభాల్లో ట్రేడ్‌ అడుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌, బీపీఎల్‌,  గెయిల్‌, ఓన్‌జీసీ, అరబిందో అదానీ పోర్ట్స్‌ నష్టపోతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top