33 వేల దిగువకు సెన్సెక్స్‌

Sensex under 33 thousand - Sakshi

పడగొట్టిన ద్రవ్యోల్బణ గణాంకాలు

92 పాయింట్ల నష్టంతో 32,942కు సెన్సెక్స్‌

38 పాయింట్లు క్షీణించి 10,187కు నిఫ్టీ  

ఆద్యంతం తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ముగి సింది. పెరిగిన ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ రేట్ల కోత ఆశలపై నీళ్లు చల్లడంతో సెన్సెక్స్‌ కీలకమైన 33 వేల పా యింట్ల దిగువకు, నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. మార్కెట్‌ నష్టపోవడం ఇది వరుసగా రెండో రోజు. సెన్సెక్స్‌ 92 పాయింట్ల నష్టంతో 32,942 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయిం ట్ల నష్టంతో 10,187 పాయింట్ల వద్ద ముగిశాయి.

రేట్ల కోత ఉండకపోవచ్చు..!
సోమవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి, 3.58 శాతానికి పెరిగింది. మరోవైపు మంగళవారం ట్రేడింగ్‌ సమయంలోనే టోకు ధరల ద్రవ్యోల్బణ (డబ్ల్యూపీఐ) గణాంకాలు వచ్చాయి. అక్టోబర్‌ డబ్ల్యూపీఐ ఆరు నెలల గరిష్టానికి, 3.59 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం 4 శాతం రేంజ్‌కు చేరువ అవుతుండటం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో వచ్చే నెల 6న జరిగే పరపతి సమీక్షలో ఆర్‌బీఐ రేట్లను పెంచకపోవచ్చని అంచనాలు బలపడడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది.  

హెచ్చుతగ్గుల్లో స్టాక్‌ సూచీలు
సెన్సెక్స్‌ ఒక దశలో 93 పాయింట్లు లాభపడగా, మరో దశలో 126 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 219 పాయింట్ల        రేంజ్‌లో కదలాడింది.

పేలవంగా ఖదిమ్‌ ఇండియా లిస్టింగ్‌
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్‌ రిటైలర్‌ కంపెనీ ఖదిమ్‌ ఇండియా షేర్‌ స్టాక్‌ మార్కెట్లో పేలవంగా లిస్టయింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.750తో పోలిస్తే 3% నష్టంతో రూ.727 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 10 శాతం నష్టంతో రూ. 677 కనిష్ట స్థాయిని తాకింది.

చివరకు 8.2 శాతం నష్టంతో రూ.689 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 5.31 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 28 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,236 కోట్లుగా ఉంది. ఈ నెల 2–6 మధ్య ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ రూ.543 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 1.9 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top