లాభాల నుంచి నష్టాల్లోకి..

Sensex turns negative, Nifty below 10,000

ముంబై : దూకుడుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, చివరికి నిరాశపడ్డాయి. ఉన్నట్టుండి ట్రేడర్లు అమ్మకాల బాట పట్టడంతో లాభాల నుంచి నష్టాల్లోకి మరలాయి. సెన్సెక్స్‌ 90.42 పాయింట్ల నష్టంలో 31,833 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 44.65 పాయింట్ల నష్టంలో 10వేల మార్కు కిందకి పడిపోయి 9,972 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌, నిఫ్టీలు రెండూ కూడా ఉదయం సెషన్‌లో మంచి లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. 

ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగంలో ఎక్కువగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా నష్టపోయింది. ఎయిర్‌టెల్‌ 6 శాతం లాభపడగా... పీఎన్‌బీ ఎక్కువగా 4 శాతం పతనమైంది. పీఎన్‌బీతో పాటు ఎస్‌బీఐ, కొటక్‌ మహింద్రా బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీలు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసల బలపడి 65.25గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లోబంగారం ధరలు స్వల్పంగా 30 రూపాయల నష్టంలో రూ.29,795గా ఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top