స్టాక్‌మార్కెట్ల లాభాల సెంచరీ

Sensex rises nearly 150 points ,Nifty above 10,200 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.   సెన్సెక్స్‌  సెంచరీ లాభాలతో 33వేలస్థాయిని, నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 10, 200 ని అధిగమించింది.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్‌  149 పాయింట్లు ఎగిసి 33, 097వద్ద,  నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10, 206 వద్ద కొనసాగుతోంది.  బ్యాంక్‌ నిఫ్టీ కూడా రీబౌండ్‌ అయింది.

దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా  టెలికాం, పీఎస్‌యూ  సె‍క్టార్లు లాభాల్లో ఉన్నాయి.  బీహెచ్‌ఈఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా, టీవీఎస్‌ మోటార్‌ తో పాటు అన్ని పీఎస్‌యే బ్యాంకింగ్‌ షేర్లు  లాభాల్లో ఉండగా,  సన్‌టీవీ, టెక్‌ మహీంద్రా, ఐషర్‌ మెటార్స్‌ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి నెలకొంది. మరోవైపు క్యూ2 ఫలితాల నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా భారీగా నష‍్టపోతోంది.
 

Back to Top