లాభాల ప్రారంభం: ఐటీ డౌన్‌

Sensex opens higher,Nifty above 10600 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాలతో ప్రారంభమైనాయి.   సెన్సెక్స్‌ 156 నిఫ్టీ 50పాయింట్ల లాభంతో  కొనసాగుతున్నాయి.  తద్వారా నిఫ్టీ 10600 కి ఎగువన  కొనసాగుతోంది. చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ , ఆటొ  సెక్టార్‌ బాగా లాభపడుతోంది. మరోవైపు రుపీ బలపడటంతో  ఐటీ సెక్టార్‌ నష్టపోతోంది. గ్రాసిం, మారుతి సుజుకి, బజాజ్‌  ఫైనాన్స్‌ , జెట్‌ ఎయిర్‌వేస్‌ హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, టాటా  స్టీల్‌, టాప్‌ విన్నర్స్‌గా ఉండగా సన్‌ఫర్మా ,  అశోక్‌లేలాండ్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్ర టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

మరోవైపు అంతర్జాతీయ  మార్కెట్‌లో చమురు ధర 70 డాలర్ల దిగువకు చేరింది. అటు  దేశీయ కరెన్సీ రుపీ  డాలరుమారకంలో  బలంగా ట్రేడింగ్‌ను  ప్రారంభించింది.   81 పైసలు పుంజుకుని  72 వద్ద 8 వారాల గరిష్టానికి చేరింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top