లాభాల ముగింపు

Sensex, Nifty Turn Flat As Markets Recover  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఎట్టకేలకు బుధవారం లాభాల్లో ముగిసాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన నిఫ్టీ, సెన్సెక్స్‌ కీలక సూచీలు రెండూ  చివరికి  పాజిటివ్‌ ముగింపు నిచ్చాయి.   మిడ్‌సెషన్‌ తరువాత కనిష‍్ట స్థాయినుంచి 300 పాయింట్లు లాభపడినా, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో చివరికు  సెన్సెక్స్‌  84 పాయింట్ల లాభాలకు పరిమితమై  37481 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు ఎగిసి 11118 వద్ద ముగిసాయి. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు, మెటల్‌, ఆటో, ఫార్మ లాభాల్లో ముగిసాయి. 

జీఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్సిస్‌ బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్‌, టైటన్‌, భారతి ఇన్‌ఫ్రా,  రిలయన్స్‌, మారుతి సుజుకి, టెక్‌ మహీంద్ర, ఎన్‌పీసీతోపాటు  డిష్‌ టీవీ, అలహాబాద్‌ , బయోకాన్‌ ఎన్‌ఐఐటీ  నష‍్టపోయాయి.  యస్‌బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌, టాటా స్టీల్‌,  హీరో మోటో, సన్‌ ఫార్మ, వేదాంతా, టాటా మోటార్స్‌ టాప్‌ విన్నర్స్‌గాఉన్నాయి. అలాగే కాఫీ డే ఫౌండర్‌  వీజీ సిద్ధార్థ అదృశ్యం ఉదంతం చివరికి విషాదాంతం కావడంతో వరుసగా రెండో రోజు కూడా కాఫీ డే షేర్లు నష్టపోయాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top