ట్రేడ్‌ వార్‌ : ఫ్లాట్‌గా మార్కెట్లు

Sensex, nifty in Trade - Sakshi

సాక్షి, ముంబై:  ట్రేడ్‌వార్‌ భయాలు మరోసారి ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి.  దీంతో  స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి.  అంతర్జాతీయప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీల్లో ఆరంభ నష్టాలు మరింత  పెరిగాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్లు నష్టపోయి 35,384  వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించి 10,720   వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే ట్రేడ్‌  అవుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, రియల్టీ, మెటల్‌  నష్టపోతున్నాయి.

ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభపడుతున్నాయి. కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌, యస్‌బ్యాంక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పలు ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో వాణిజ్య వివాద ఆందోళనలుమరోసారి బలపడ్డాయి. దీంతో గురువారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top