మూడో రోజూ నష్టాలతోనే ముగింపు

Sensex, Nifty slide for 3rd day - Sakshi

ముంబై : ప్రారంభం నుంచి నష్టాలు పాలైన స్టాక్‌ మార్కెట్లు, చివరికి మరింత పతనమయ్యాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో, సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగిసింది. 181.43 పాయింట్ల నష్టంలో 32,760 వద్ద క్లోజైంది. అదేవిధంగా నిఫ్టీ 68.55 పాయింట్ల నష్టంలో 10,118 వద్ద స్థిరపడింది.

తొలి నుంచీ నీరసంగా కదిలిన మార్కెట్లు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహపరచడంతో మెటల్‌ కౌంటర్లు భారీగా బలహీనపడ్డాయి. ఇన్వెస్టర్లు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ నేటి ట్రేడింగ్‌లో అతిపెద్ద లూజర్‌గా నష్టాలు గడించింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌తో పాటు వేదంత, హిందాల్కో, సన్‌ఫార్మాలు కూడా 5 శాతం మేర నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top