స్టాక్‌ మార్కెట్లలో జోష్‌..

Sensex Nifty Scale Fresh Record Highs - Sakshi

ముంబై : ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో పాటు గ్లోబల్‌ మార్కెట్ల మద్దతుతో బుధవారం స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో భారీగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. రూపాయి నిలకడగా ట్రేడవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆరంభంలో 188 పాయింట్ల లాభంతో 39,245 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 11, 750 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఎస్‌బీఐలు భారీగా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top