ట్రిపుల్‌ సెంచరీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు

Sensex, Nifty Extends Gains Over 330 Points - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంలో స్వల్ప లాభాలకు పరిమితమైన సూచీలు వెంటనే 200 పాయింట్లు లాభపడ్డాయి. మిడ్‌ సెషన్‌ తరువాత ట్రిపుల్‌ సెంచరీ లాభాలతో  హై జంప్‌ చేశాయి.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  సెన్సెక్స్‌ 336 పాయింట్లు జంప్‌ చేసి 38,468 వద్ద  హుషారుగా కదులుతోంది. నిఫ్టీ కూడా 103 పాయింట్లు పుంజుకుని 11,544 వద్ద ట్రేడవుతోంది. 

దాదాపు అన్నిరంగాలూ లాభపడగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2-1.25 శాతం మధ్య ఎగశాయి. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు బాగా లాభపడుతున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో ఫీనిక్స్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, శోభా 4.3-1 శాతం మధ్య పెరిగాయి. 

హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఐబీ హౌసింగ్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్, జీ, యస్‌ బ్యాంక్‌, వేదాంతా, బీపీసీఎల్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉండగా,   ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌, హీరో మోటో  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top