ఐదు రోజుల నష్టాలకు స్వల్ప ఊరట

Sensex, Nifty Break Five-Day Losing Streak - Sakshi

ముంబై : వరుసగా ఐదు రోజుల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నెలకొంటున్న నష్టాలకు నేడు బ్రేక్‌ పడింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 35 పాయింట్ల లాభంలో 34,651 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో 10,536 వద్ద క్లోజయ్యాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌ స్టాక్స్‌లో నెలకొన్న కొనుగోళ్లతో కీలక సూచీలు నేడు లాభాల్లోకి ఎగిశాయి. టాప్‌ గెయినర్లుగా ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటోలు 3-6 శాతం లాభాలు ఆర్జించాయి. 

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు కూడా ఫలితాల ప్రకటన తర్వాత 6 శాతం మేర జంప్‌ చేసింది. క్యూ4లో భారీగా రూ.7,718 కోట్ల నష్టాలను నమోదు చేసినప్పటికీ బ్యాంకు షేర్లు ఈ మేర పెరగడం గమనార్హం. ఐవోసీ, అల్ట్రాటెక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.5-0.8 శాతం మధ్య క్షీణించాయి. గత ఐదు సెషన్లలో మాత్రం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మొత్తం 940 పాయింట్ల మేర కోల్పోయింది. నిఫ్టీ 289 పాయింట్లు నష్టపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top