మార్కెట్లో ద్రవ్యోల్బణ ఊరట

Sensex jumps 142 pts Nifty rises 45 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ  స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి.  అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ట్రేడింగ్‌‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు పటిష్ట లాభాలతో ప్రారంభమైనాయి.  అయితే మిడ్ సెషన్‌లో కొంత ఒత్తిడినెదుర్కొన్నప్పటికీ, ద్రవ్యోల్బణ వార్తల  ఊరటతో లాభాల జోరు కొనసాగింది. ఒక దశలో 370 పాయింట్ల వరకూ జంప్‌చేసిన సెన్సెక్స్‌ 141 పాయింట్లు లాభంతో 34,297 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు బలపడి 10,545 వద్ద స్థిరపడింది.

అయితే పీఎన్‌బీ బ్యాంక్‌ ముంబై బ్రాంచీలో రూ. 11,400 కోట్ లమేర అవకతవకలు జరిగినట్లు వెల్లడికావడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లలో అమ్మకాలు ధోరణి నెలకొంది. నెగిటివ్‌ సెంటిమెంట్‌తో  బ్యాంకింగ్‌   షేర్లు  బలహీనపడ్డాయి.  రియల్టీ కూడా  నష్టపోయింది.  బీపీసీఎల్‌, హిందాల్కో, ఐసీఐసీఐ, వేదాంతా, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌, ఇన్ఫోసిస్‌, ఇన్ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లాభపడగా, ఐబీ హౌసింగ్‌, అరబిందో, సిప్లా, భారతీ, జీ, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్‌, టాటా స్టీల్‌, లుపిన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టపోయాయి.
 

Back to Top