ఎగ్జిట్‌ పోల్స్‌ : మార్కెట్‌ మెరుపులు

Sensex gains 216 pts post Gujarat exit polls - Sakshi

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో మార్కెట్లు పరుగులు తీశాయి. రోజంతా కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ఆఖరికి మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 216 పాయింట్ల లాభంలో 33,462 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు జంప్‌ చేసి 10,333 వద్ద స్థిరపడింది. ఆరంభంలోనే 358 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ ఎగిసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మినహా మిగతా అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే నడిచాయి. మిడ్‌​క్యాప్స్‌ కూడా మంచి లాభాలు పండించాయి.  మెటల్స్‌, రియల్టీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2.7-1.2 శాతం మధ్య పైకి ఎగిశాయి.

వేదాంతా, యస్‌బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హిందాల్కో, కోల్‌ ఇండియా, ఐషర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేయగా.. టెక్‌ మహీంద్రా, సిప్లా, బాష్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, భారతీ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, అంబుజా 3.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. మోదీ హవాతో మరోసారి కూడా గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సంకేతాలిచ్చేశాయి. దీంతో మార్కెట్లు లాభాల పంట పండించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ సంకేతాలతో రూపాయి విలువ కూడా పుంజుకుంది. ఆరంభంలో 23 పైసలు లాభపడిన రూపాయి, ప్రస్తుతం 19 పైసల బలంతో 64.15గా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top